అల్లు అర్జున్ 'సంధ్యా థియేటర్' కేసు అప్డేట్!

హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టులో ఈరోజు సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుపై విచారణ జరగనుంది. గత హీరింగ్‌కు హీరో అల్లు అర్జున్ షూటింగ్ బిజీ వల్ల వర్చువల్‌గా హాజరుకాగా, ఈరోజు కూడా ఆయన ఆన్‌లైన్ ద్వారానే అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులుగా ఉండగా, అందరూ కలిసి వస్తేనే తదుపరి విచారణ ముందుకు సాగుతుందని కోర్టు లాస్ట్ టైమ్ స్పష్టం చేసింది. దీంతో ఈరోజు కోర్టు విచారణపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.



