గుంతకల్లులో వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు అనంతపురం జిల్లా గుంతకల్లులో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఊరేగింపులో అధిక శబ్దంతో డీజేలు వినియోగించరాదని, మద్యం సేవించి పాల్గొనకూడదని పోలీసులు సూచించారు. రాజకీయ పార్టీల పాటలు వినిపించడం, వాహనాలకు రాజకీయ జెండాలు కట్టడం నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.



