సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

వైద్య చికిత్సల కోసం ఆర్థిక సాయం కోరిన 46 మంది లబ్ధిదారులకు కడప జిల్లా ప్రొద్దుటూరులో రూ.35.24 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి పంపిణీ చేశారు. టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కులు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,401 మందికి మొత్తం రూ.12.22 కోట్లకు పైగా సీఎంఆర్‌ఎఫ్ సాయం అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయనిధి ఆర్థికంగా అండగా నిలుస్తోందన్నారు.



