25న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం

సెప్టెంబర్ 25న నిర్వహించనున్న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నెల్లూరు జిల్లా అధికారులను జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని శంకరన్ భవన్‌లో అన్ని శాఖల అధికారులతో జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 1 నుంచి 19 ఏళ్ల వయసున్న పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా Albendazole మాత్రలు అందించనున్నట్లు తెలిపారు.



