రక్షా బంధన్ యాడ్‌పై కృతి సనన్ క్లారిటీ.. ఏమన్నారంటే?

కృతి సనన్ రక్షా బంధన్ యాడ్‌పై వచ్చిన విమర్శలకు రెస్పాండ్ అయ్యారు. యాడ్‌లో తన బట్టలపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేయగా, కంగనా రనౌత్ కూడా విమర్శలు చేశారు. దీనిపై కృతి మాట్లాడుతూ.. పండుగల స్ఫూర్తి వేసుకునే బట్టల్లో కాదు, మనసులోని భావాలు, బంధాలు, సంప్రదాయాల్లో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఏం ధరించాలనే విషయంపై సమాజం ఎప్పుడూ సూచనలు చేస్తుందని ప్రశ్నించారు.



