← Back to news

పేకాటరాయుళ్లకు పోలీసుల కౌన్సెలింగ్

By malluru chandrashekar· 1h ago· Vemsoor, Vemsoor, Khammam
పేకాటరాయుళ్లకు పోలీసుల కౌన్సెలింగ్

TG: ఖమ్మం జిల్లా వేంసూరు మండల కేంద్రంలో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడిన పలువురికి ఎస్సై పల్లెల ప్రదీప్ ఆదివారం పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ నిర్వహించారు. పేకాట, జూదం వల్ల కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు. ఇకపై చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. మళ్లీ ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో జూదం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.

More in Local