నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

AP: పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణంలో నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులపై కఠిన చర్యలు తప్పవని పట్టణ ఎస్ఐ సత్యనారాయణ హెచ్చరించారు. ఆదివారం పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో పత్రాలు సరిగా లేని 15 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి ఫైన్ విధించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. వాహనాలకు నంబర్ ప్లేట్లు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని స్పష్టం చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరారు.



