← Back to news

రెవెన్యూ సిబ్బంది పనితీరు మార్చుకోవాలి: కన్నా

By Siva· 1h ago· Pakalapadu, Sattenapalli, Palnadu

పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకలపాడు గ్రామంలో డిజిటల్ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో MLA కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో భూ సమస్యలు, పాస్ పుస్తకాల్లో తప్పులపై డిప్యూటీ తహసీల్దార్ రవికుమార్‌ను ప్రశ్నించారు. భూమి రీసర్వేలో తప్పులు ఎలా జరుగుతున్నాయని నిలదీశారు. రెవెన్యూ సిబ్బంది చేసే తప్పుల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఫైరయ్యారు. పాస్ పుస్తకాల్లో మరోసారి తప్పులు వస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

More in Local