జలాల్‌పూర్‌లో ముసాయిదా ఓటరు జాబితా విడుదల

నిజామాబాద్ రూరల్ మండలం జలాల్‌పూర్ గ్రామంలో BLOల ఆధ్వర్యంలో ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. గ్రామ సభలో జాబితాను ప్రజలకు చదివి వినిపించారు. అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని, జాబితాలో తప్పులు ఉంటే సవరణకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

