‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ ఫిక్స్!

శ్రీవిష్ణు కొత్త సినిమా ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమాను అక్టోబర్ 9న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. 1990 కాలంలో ఆంధ్రా-ఒడిశా బోర్డర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే కామెడీ అండ్ యాక్షన్ సినిమా. ఇందులో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సత్య, ముక్కు అవినాష్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. జానకిరామ్ మారెళ్ల దర్శకత్వంలో, కోన వెంకట్ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకి విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ అందిస్తున్నారు.



