← Back to news

ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్!

By sahani· 25 Jun 2026· X
ఆధార్ యూజర్లకు గుడ్‌న్యూస్!

UIDAI ఆధార్ కార్డ్ యూజర్లకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. నెక్స్ట్ మంత్ 1 నుండి డిసెంబర్ 31 వరకు (6 నెలల పాటు) ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీ అప్‌డేట్ చేసుకునే వాళ్ళకి ఎలాంటి ఫీజు ఉండదని అనౌన్స్ చేసింది. మామూలుగా దీనికోసం రూ.75 ఫీజు వసూలు చేస్తారు, కానీ ఈ 6 నెలలు అది ఫ్రీ! ఆధార్‌తో ఈమెయిల్ లింక్ చేసుకుంటే అప్‌డేట్స్ అన్నీ ఇన్స్టంట్‌గా వస్తాయని UIDAI చెప్పింది. అయితే, ఈ ఉచిత సేవ కేవలం మొబైల్ యాప్ ద్వారా చేసుకునే వాళ్ళకే వర్తిస్తుంది, గుర్తుంచుకోండి.

More in Technology