హైదరాబాద్‌లో భారీ వర్షం..రోడ్లు జలమయం!
రాజేంద్రనగర్, అత్తాపూర్ ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. వానకు రోడ్లన్నీ నీళ్లతో నిండిపోవడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు ఎల్నినో ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో సరైన వర్షాలు లేక రైతులు దిగాలుపడుతుంటే, తెలంగాణలో మాత్రం పలుచోట్ల వర్షాలు బాగా పడుతున్నాయి.



