అభిజీత్ సహా CJP లీడర్స్ రిలీజ్

నిన్న విమానంలో డిటైన్ చేసిన CJP లీడర్స్ అభిజీత్ దీప్కే, అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌ను పోలీసులు ఇప్పుడే రిలీజ్ చేశారు. మార్నింగ్ వారిని కోర్టులో హాజరుపరచగా.. కోర్టు వారిని రిలీజ్ చెయ్యాలని ఆదేశించింది. CEC జ్ఞానేష్ కుమార్ రిజైన్ డిమాండ్‌తో అక్టోబర్ 10న ఢిల్లీ, జంతర్ మంతర్ ప్రొటెస్టుకి CJP పిలుపు ఇచ్చింది. ఈ ప్రొటెస్టుకి వెళ్తుండగా.. విమానంలోనే ముగ్గుర్నీ డిటైన్ చెయ్యడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇవాళ కూడా ప్రొటెస్టుకి పిలుపిచ్చింది CJP. అటు ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీని కంటిన్యూ చేస్తున్నారు.

