← Back to news

వైఎస్ వర్ధంతి.. గోకవరంలో ఘన నివాళులు!

By gani· 2d ago· Gokavaram, Gokavaram, East Godavari
వైఎస్ వర్ధంతి.. గోకవరంలో ఘన నివాళులు!

తూ.గో. జిల్లా గోకవరంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఘనంగా జరిగింది. సుంకర శ్రీవల్లి వీరబాబు ఆధ్వర్యంలో విగ్రహానికి జలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం భవిత సెంటర్‌లో దివ్యాంగ విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. వీరబాబు మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం వైఎస్ అనేక కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. ఆరోగ్యశ్రీ పథకం నిరుపేదలకు మేలు చేసిందని అన్నారు. వైఎస్సార్ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 7h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.