పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం.. అధికారుల తీరుపై స్థానికుల ఫైర్

TG: మంచిర్యాల జిల్లా మందమర్రి స్టేషన్ రోడ్ 2వ జోన్ పరిధిలోని 10వ వార్డులో పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా మారింది. నెల రోజులుగా చెత్త సేకరణ వాహనాలు రావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర వార్డుల్లో చిన్న చెత్త వాహనాలు, ట్రాక్టర్లు క్రమం తప్పకుండా తిరుగుతున్నప్పటికీ తమ వార్డును మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. సమస్యపై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా మ్యాన్‌పవర్ కొరత, లైన్ ఎత్తులో ఉండటం వంటి కారణాలు చెబుతున్నారని తెలిపారు.





