1,805 మంది ఓటర్లకు నోటీసులు

TG: నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ గ్రామపంచాయతీలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గురువారం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ అసిస్టెంట్ రాథోడ్ విజయ మాట్లాడుతూ.. మొత్తం 1,805 మంది ఓటర్లకు నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. నోటీసుల్లో ఉన్న వివరాలను పరిశీలించి ఏవైనా తప్పులు, పొరపాట్లు ఉంటే సకాలంలో సవరణలు చేసుకోవాలని సూచించారు. మరో 165 మంది ఓటర్లకు 2002 ఓటర్ జాబితాలో సంబంధిత వివరాలు లేవని వెల్లడించారు. నోటీసులను బీఎల్‌వోలు సంబంధిత ఓటర్లకు పంపిణీ చేస్తారని తెలిపారు.

