← Back to news

రైతు బిడ్డకు MBBS సీటు.. అభినందనల వెల్లువ

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial
రైతు బిడ్డకు MBBS సీటు.. అభినందనల వెల్లువ

TG: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్‌కు చెందిన రైతు కుటుంబం కుమార్తె మహమ్మద్ ఆయేషా నీట్‌లో ఉత్తీర్ణత సాధించి జగిత్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో MBBS సీటు సాధించింది. ఎండపల్లి మండల ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు చెన్న కుమారస్వామి ఆయేషాను సన్మానించి అభినందించారు. గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థిని వైద్య విద్యలో సీటు సాధించడం అభినందనీయమని, ఆయేషా గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలిచిందని పేర్కొన్నారు. పట్టుదలతో చదివితే గ్రామీణ విద్యార్థులు కూడా ఉన్నత లక్ష్యాలను సాధించగలరని తెలిపారు.

More in Local