← Back to news

పంటల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

By Baji khan patan· 1d ago· Khammam
పంటల వివరాలు కచ్చితంగా నమోదు చేయాలి

TG: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం సఖినవీడు గ్రామంలో కొనసాగుతున్న డిజిటల్‌ పంట సర్వేను ఏఓ బోయినపల్లి సాయి శివ గురువారం పరిశీలించారు. ప్రతి కమతంలో రైతులు సాగు చేసిన పంటలు, రకాలు, నీటి వనరుల వివరాలను త్వరగా, కచ్చితంగా నమోదు చేయాలని వాలంటీర్లకు సూచించారు. రైతులు సైతం సర్వేలో భాగస్వాములై అవసరమైన వివరాలను అందించాలని కోరారు. డిజిటల్‌ సర్వేలో నమోదైన పంట వివరాలు పంటల కొనుగోళ్లు, నష్టపరిహారం, రుణాల మంజూరు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ఉపయోగపడతాయని రైతులకు వివరించారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 2h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.