వీసా, జాబ్ పేరుతో రూ.15 లక్షల మోసం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకి చెందిన శివ క్రాంతికుమార్ వద్ద 'వీసా రెన్యువల్ చేయిస్తామని, లండన్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని' చెప్పి యూట్యూబర్ నందన రూ.15 లక్షలు తీసుకుని మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు భర్త మధుకర్ కూడా డబ్బులు తీసుకుని హ్యాండ్ ఇచ్చారని చెప్పారు. ఈ కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నందనను ఏ-1గా, ఆమె భర్తను ఏ-2గా, మామ మోహన్‌రావును ఏ-3గా పేర్కొన్నట్లు సమాచారం.

