ధాన్యం కేసులో సర్పంచ్‌కు హైకోర్టులో ఊరట

ధాన్యం నిల్వల కొరత ఆరోపణలతో కేసు ఎదుర్కొంటున్న నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలం అర్లీ (కే) సర్పంచ్, రైస్ మిల్ యజమాని చంద్యాల మురళీమోహన్‌కు హైకోర్టులో ఊరట లభించింది. కుంటాల పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎన్. తుకారాంజీ ధర్మాసనం విచారించింది. నవంబర్ 11 వరకు ఆయనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. దీంతో ఈ కేసులో మురళీమోహన్‌కు తాత్కాలిక ఉపశమనం లభించినట్లయింది.

