← Back to news

విద్యారంగ పరిరక్షణకు జంగయ్య కృషి అభినందనీయం

By Bhasker Mamilla· 1h ago
విద్యారంగ పరిరక్షణకు జంగయ్య కృషి అభినందనీయం

TG: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో యూటీఎఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఉద్యోగ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు కే.జంగయ్య ఉద్యోగ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన సభ నిర్వహించారు. ఆయన సుదీర్ఘ సేవలను సీపీఎం నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కొనియాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కామ్రేడ్ సాగర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, విద్యారంగ పరిరక్షణ, ఉద్యోగుల హక్కుల సాధనకు జంగయ్య చేసిన కృషి ప్రశంసనీయమన్నారు. ఉద్యమాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించారన్నారు.

More in Local