← Back to news

గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత

By Md Jabeer· 1h ago
గ్రామంలో స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత

TG: నిర్మల్ జిల్లా నర్సాపూర్‌ జి మండలం నందన్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కూన హేమలత మహేష్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, వార్డు సభ్యులు గుమ్ముల సాయన్న, పడకంటి సాయన్న, సుజాత, రేషన్ డీలర్ జాదవ్ చంద్రకాంత్, పత్రి నరేందర్, బింగి భోజన్న, సోమ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. లబ్ధిదారులు ప్రభుత్వ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేశారు.

More in Local