స్పీడ్ బ్రేకర్‌ను గమనించక.. ఘోర ప్రమాదం

TG: మెదక్ జిల్లా నిజాంపేట మండలం నందిగామ గ్రామ శివారులో సిద్దిపేట-మెదక్ ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న వంతెన సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన గణేష్ (21), నిర్మల్‌కు చెందిన పవర్ అనిల్ (37) ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా స్పీడ్ బ్రేకర్‌ను గమనించకపోవడంతో వాహనం అదుపుతప్పి వంతెనపై నుంచి కిందపడింది. తీవ్ర గాయాలతో ఇద్దరూ ఘటనాస్థలంలోనే మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



