స్కూల్ రోడ్లలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి

TG: ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కాకరపల్లి, విద్యానగర్ రోడ్లలో పాఠశాలల సమీపంలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతుండటంతో విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే, ముగిసే సమయాల్లో విద్యార్థులు, పాఠశాల బస్సులు, ఇతర వాహనాలతో రోడ్లు రద్దీగా మారుతున్నాయి. వేగంగా వెళ్లే వాహనాలతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. విద్యార్థుల భద్రత కోసం పాఠశాలల సమీపంలో స్పీడ్ బ్రేకర్లు, జీబ్రా క్రాసింగ్‌లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.



