← Back to news

ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన మాధవరెడ్డి

By Ramesh Ch· 1d ago
ఢిల్లీలో సీఎం రేవంత్‌ను కలిసిన మాధవరెడ్డి

TG: ఢిల్లీలో సీఎం రేవంత్‌రెడ్డితో వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ విస్తరణలో మాధవరెడ్డికి అవకాశం దక్కుతుందనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. మాధవరెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందన్న చర్చ నియోజకవర్గంలోనూ జోరుగా సాగుతోంది.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.