← Back to news

బస్సు బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్

By DK· 3h ago
బస్సు బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్

AP: కామారెడ్డి జిల్లా జుక్కల్‌ చౌరస్తా సమీపంలో జాతీయ రహదారి 161పై శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. హైదరాబాద్‌ డిపోకు చెందిన బస్సు హైదరాబాద్‌ నుంచి బిచ్కుందకు ప్రయాణికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో డ్రైవర్‌ ఆంజనేయులు (50) అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు.

బస్సు బోల్తా.. డ్రైవర్ స్పాట్ డెడ్

More in Local