ఏడిపించిన వీడియో.. మారిన 8 ఏళ్ల రామయ్య జీవితం!
నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నర్సవాడకు చెందిన 8 ఏళ్ల రామయ్య గొర్రెలు మేపుతూ ఏడుస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా <a href="https://www.theclearcutnews.com/n/E8bcKbo">వైరల్ అయ్యాయి</a>. దీంతో మినిస్టర్ నారా లోకేష్ ఆదేశాలతో ఆఫీసర్స్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ బాలుడిని పేరెంట్స్కు అప్పగించి, నెల్లూరులోని గిరిజన గురుకుల స్కూల్లో చేర్పించారు. అక్కడ రామయ్యకు కొత్త యూనిఫాం, బుక్స్, షూస్ అందించగా, బడిలో అడుగుపెట్టిన రామయ్య ఫేస్ లో హ్యాపీనెస్ కనిపించింది. కలెక్టర్ కూడా బాలుడితో వీడియో కాల్ మాట్లాడారు.


