← Back to news

విద్యార్థినులతో ట్రంక్ పెట్టెలు మోయించారు

By Srikanth Goud· 1h ago· Jagitial, Jagitial, Jagitial

జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ప్రభుత్వ బాలికల గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులతో ట్రంక్ పెట్టెలు మోయించిన ఘటన చర్చనీయాంశంగా మారింది. కోర్టు ఎదురుగా ఉన్న హాస్టల్‌కు ప్రభుత్వం నుంచి వచ్చిన పెట్టెలను బాలికలతోనే లారీ నుంచి అన్‌లోడ్ చేయించినట్లు తెలుస్తోంది. హాస్టల్ సిబ్బంది అందుబాటులో ఉన్నప్పటికీ విద్యార్థినులతో బరువైన సామగ్రి మోయించడంపై స్థానికులు, ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినులతో ఇలాంటి పనులు చేయించడం సరికాదని పేర్కొంటున్నారు.

More in Local