టైరు పేలి ట్రాక్టర్‌ను ఢీకొట్టిన కారు
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం యాకర్లపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి శ్రీశైలం దైవదర్శనానికి వెళ్తున్న కారు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న మహిళతో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.



