సౌదీలో ఫొటోలు తీయొద్దు: భారత ఎంబసీ

సౌదీ అరేబియాలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ఎంబసీ సూచించింది. వైమానిక దాడులు జరిగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, గదుల్లో ఉంటే కిటికీలకు దూరంగా ఉండాలని తెలిపింది. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీయొద్దని, సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని హెచ్చరించింది. ఎయిర్ ఇండియా, ఇండిగో సర్వీసులు అక్టోబర్ 24 వరకు, నిలిపివేశారు. అత్యవసర ప్రయాణానికి ముందు విమానాల తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.



