← Back to news

METAకు కేంద్రం కీలక సూచనలు

By Sharmila· 1h ago
METAకు కేంద్రం కీలక సూచనలు

FACEBOOK, INSTAGRAMలో తప్పుడు వార్తలు, హింసను ప్రేరేపించే పోస్టులను గుర్తించి అడ్డుకోవాలని కేంద్ర ప్రభుత్వం META సంస్థకు సూచించింది. పాత వీడియోలను కొత్త ఘటనలుగా చూపించే పోస్టులపై జాగ్రత్తగా ఉండాలని తెలిపింది. ప్రభుత్వ సంస్థలతో కలిసి పనిచేయాలని, అడిగిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఈ సూచనలు ప్రజల భావప్రకటన స్వేచ్ఛను దెబ్బతీస్తాయని డిజిటల్ రైట్స్ సంఘాలు విమర్శిస్తున్నారు. ఈ అడ్వైజరీకి చట్టంలో సరైన ఆధారం లేదని పేర్కొంటూ, దానిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

More in International