ఓటు తొలగింపుపై మరో వీడియో చేసిన ప్రకాష్ రాజ్
తన ఓటు తొలగింపుపై నటుడు ప్రకాష్ రాజ్ మరో వీడియో రిలీజ్ చేశారు. ‘నా ఓటును పర్మినెంట్‌గా షిఫ్ట్ చేశామని వెబ్‌సైట్‌లో రాసింది నిజం కాదా?’ అని ప్రశ్నించారు. ‘నా ఓటు తొలగించారని వీడియో చేసిన కొన్ని గంటల్లోనే అధికారులు మాట మార్చి మొదట పర్మినెంట్ షిఫ్ట్ అన్నారు, తర్వాత జస్ట్ షిఫ్ట్ చేశాం అంటున్నారు’ అని వివరించారు. బీఎల్ఓ తన పాత ఇంటి అడ్రెస్‌కి వచ్చి చేసిన హంగామాకు సంబంధించిన ఆధారాలన్నీ తన దగ్గర ఉన్నాయని ఆయన చెప్పారు. ఓటు హక్కు కోసం పౌరులు లైన్లో నిలబడి అడుక్కోవాలా అని ప్రశ్నించారు.



