← Back to news

ఆర్లికే బ్రిడ్జ్‌పై ప్రాణభయం.. వాహనదారుల ఆందోళన

By Md Jabeer· 20 Aug 2026

TG: నిర్మల్ జిల్లాలోని ఆర్లికే బ్రిడ్జ్ వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. లోకేశ్వరం మండలంలోని ఈ వంతెన శిథిలావస్థకు చేరడంతో ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వంతెనకు ఉన్న రెయిలింగ్‌లు ధ్వంసమై పడిపోవడంతో పాటు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం ప్రమాదాన్ని మరింత పెంచుతోంది. రాత్రివేళ పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉంటుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వంతెన దుస్థితిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.

More in Local