నిజమాబాద్‌లో నేడు గవర్నర్ పర్యటన

TG: నిజామాబాద్‌లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 10.20 గంటలకు హెలికాప్టర్లో నిజామాబాద్ ఐడీఓసీకి చేరుకుంటారు. ఉదయం 11 గంటలకు భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 గంటలకు జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని పరిశీలిస్తారు. 1.50 గంటలకు MP ధర్మపురి ఫౌండేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 3.20 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు.



