'సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైంది'

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి పతనం మొదలైందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఘాటుగా విమర్శించారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ నుంచి భారీగా కొనసాగిన నిరసన మహాధర్నా ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని వినతి పత్రం అందజేశారు. ఆడపిల్లల వివాహాలకు అండగా నిలిచే పథకాలను నిర్వీర్యం చేయడం దారుణం అని విమర్శించారు.



