← Back to news

రేపు CJIను కలుస్తాము: మల్లికార్జున్ ఖర్గే

By Mahesh· 1h ago· X· Delhi

కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. రేపు సాయంత్రం 4–5 గంటల మధ్య CJIను కలిసి యువత ఆందోళనపై తమ ఆందోళనలను వివరించి, జోక్యం చేసుకోవాలని కోరుతామని తెలిపారు. నిన్న 32 వేల మంది పోలీసులు, 7,500 మంది CRPF స్టాఫ్ మోహరించడం ప్రభుత్వ భయాన్ని చూపుతోందని విమర్శించారు. రోడ్ల బ్లాక్, కమ్యూనికేషన్ ఆంక్షలు, మొబైల్ నెట్‌వర్క్‌ల నిలిపివేత ప్రజాస్వామ్య హక్కులకు విఘాతమని ఆరోపించారు.

More in National