ఇక జ్ఞానేష్ కాదు.. టార్గెట్ "మోదీ, షా"!

CJP తన స్ట్రాటజీ మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకూ CEC జ్ఞానేష్ కుమార్‌ని టార్గెట్ చేస్తూ వచ్చిన CJP, ఇవాళ్టి ప్రెస్‌మీట్‌లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాని టార్గెట్ చేసింది. ఎమర్జెన్సీ కంటే తీవ్ర పరిస్థితులు ఉన్నాయనీ, మోదీ డిక్టేటర్‌లా మారారని విమర్శించారు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్. "జ్ఞానేష్‌తో మొదలైన ఫైట్.. ఇప్పుడు మోదీ, షాకి వ్యతిరేకంగా మారింది" అని వారనడం కీ పాయింట్. ఈ ప్రభుత్వం పోతుందని అన్నారు. ఇకపై వారి టార్గెట్ మోదీ, షా గా ఉండొచ్చు.


