← Back to news

పరకాల అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ కష్టాలు

By prabhakar kodepaka· 2d ago· Hanumakonda

TG: హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేద్కర్ సెంటర్‌లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు, బాటసారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఈ జంక్షన్‌ మీదుగానే వెళ్లడంతో రాకపోకలు స్తంభిస్తున్నాయి. సరైన ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. పాఠశాల విద్యార్థులు, వృద్ధులు రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రద్దీ సమయాల్లో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 8h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.