‘అంగన్ మిలన్’ సేవా కార్యక్రమం

కామారెడ్డి జిల్లా బిచ్‌కుంద మున్సిపాలిటీ SC కాలనీ అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘అంగన్ మిలన్’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కో-ఇంచార్జి రాథోడ్ సునీత పాల్గొని కేంద్ర పథకాలపై అవగాహన కల్పించారు. అంగన్‌వాడీ టీచర్, ఆశా కార్యకర్త, ఆయమ్మలను శాలువాలతో సన్మానించి, చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.



