స్కూల్లో హెల్త్ ప్రోగ్రామ్.. సైకాలజిస్ట్ టిప్స్🧠

నర్సంపేట గవర్నమెంట్ మైనారిటీ స్కూల్లో మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శ్రీలత విద్యార్థులతో మాట్లాడుతూ.. ఎగ్జామ్ స్ట్రెస్, మైండ్ ప్రెజర్, టెన్షన్ ఎలా తగ్గించుకోవాలో చెప్పారు. ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు మనసులోనే దాచుకోకుండా సాయం తీసుకోవాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని సూచించారు. స్టూడెంట్స్ అందరూ ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు.



