భారీ వర్షాలకు కూలిన ఇళ్లు

అరకులోయ మండలం శారదా బోందుగుడలో కిల్లో జయరాం, కరసలిగుడలో పూజారి గోపి ఇళ్లు భారీ వర్షాల కారణంగా కూలిపోయాయి. సమాచారం అందుకున్న ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యుడు కిల్లో సాయిరామ్ బాధితులను పరామర్శించి, దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు.



