వ్యాపారిని చంపేస్తానని బెదిరింపు.. రౌడీషీటర్ అరెస్ట్

AP: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో రౌడీషీటర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన సీఐ నవీన్ కుమార్ స్థానిక రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ముగ్గురు రౌడీషీటర్లను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తాజాగా ఓ వ్యాపారిని డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించిన రౌడీషీటర్ రౌతు తేజపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రౌతు తేజపై గతంలో నాలుగు కేసులు ఉన్నట్లు సీఐ నవీన్ కుమార్ తెలిపారు.



