కొండంతా చెత్త.. ఒక్క డ్రైవ్‌తో క్లీన్!
బెంగళూరులో చెత్తతో నిండిపోయిన ఓ కొండను కోల్‌కతాకి చెందిన ఓ మహిళ క్లీన్ చేస్తుండటం వైరల్ అయ్యింది. ఆమెతోపాటూ మరో 20 మంది ఉద్యోగులు కలిసి శుభ్రం చేశారు. CSR కార్యక్రమంలో భాగంగా కొండపై పేరుకుపోయిన ప్లాస్టిక్, ఇతర చెత్తను తొలగించారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అంటూ HandsOn Foundation ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ ప్రదేశం హున్స్‌మారనహళ్లి దగ్గర్లోని అకాయమనా బెట్టా కావచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశారు.
