← Back to news

రాజాం రహదారిపై పశువుల బెడద తీరదా?

By Mohan· 6d ago

రాజాం పట్టణ ప్రధాన రహదారిపై పశువుల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు మధ్యలో పశువులు గుంపులుగా సంచరించడం, రోడ్డుపైనే పడుకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెయిన్ రోడ్డు, డోలపేట సెంటర్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. ఉదయం, సాయంత్రం ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పశువులు అడ్డంగా ఉండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపై వదిలేసి పట్టించుకోకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని స్థానికులు అంటున్నారు.

More in Local