పొట్టకూటి కోసం వెళ్లి.. ప్రాణాలు కోల్పోయిన 8 మంది

మధ్యప్రదేశ్ రాష్ట్రం భీండ్ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్వాలియర్–భీండ్ నేషనల్ హైవేపై ఛిమ్కా గ్రామం దగ్గరలో కూలీలతో వెళ్తున్న పికప్ వెహికల్ ఎదురుగా వస్తున్న డంపర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు మృతి చెందారు. మరో 32 మందికి గాయాలయ్యాయి. గ్వాలియర్‌లో వరి నాట్లు పనులు ముగించుకుని ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఉన్న పశువులను తప్పించేందుకు డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు.



