← Back to news

ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో రోడ్డు

By Srinivas· 1d ago
ప్రజల ఇబ్బందులు చూసి సొంత నిధులతో రోడ్డు

TG: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామంలో ప్రజలు, భక్తుల రాకపోకల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్‌ సీనియర్‌ నాయకులు రవీందర్‌ యాదవ్‌ సొంత నిధులతో మట్టి రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కోట మైసమ్మ దేవాలయం నుంచి హనుమాన్‌ దేవాలయం వరకు చేపట్టిన రోడ్డు పనులను గురువారం గ్రామస్థుల సమక్షంలో ప్రారంభించారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు తనవంతు సహకారం కొనసాగిస్తానని రవీందర్‌ యాదవ్‌ తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్‌ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

More in Local

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో
Local· 4h ago

కరెంట్ కోసం చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో

TG: కరెంట్ కోతలతో విసిగిపోయిన మహబూబాబాద్ జిల్లా మునిగలవీడు గ్రామస్తులు చీకట్లో కొవ్వొత్తులతో రాస్తారోకో చేపట్టారు. శుక్రవారం రాత్రి మహబూబాబాద్–తొర్రూరు రహదారిపై విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించడంతో వాహనాలు నిలిచిపోయాయి. ప్రభుత్వం కరెంట్ కోతలు లేవని చెబుతున్నా రోజులో పలుమార్లు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. సాయంత్రం, రాత్రి వేళల్లో కోతలు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అధికారులతో మాట్లాడి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.