పోలీసు అన్నలకు రాఖీ.. షాద్‌నగర్‌లో ప్రత్యేక వేడుక

TG: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో విద్యార్థినులు పోలీసులకు రాఖీలు కట్టి రక్షాబంధన్ వేడుకలను నిర్వహించారు. తమను ఎల్లప్పుడూ సోదర భావంతో రక్షిస్తూ ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అసెంబ్లీ ఇన్‌చార్జ్ ఆల్ సాయికుమార్‌తో పాటు వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. పట్టణ సీఐ సీతారాం, ఎస్సైలు, కానిస్టేబుళ్లకు మహిళా విద్యార్థులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

