← Back to news

అత్యాచారం కేసు ఖైదీకి పదే పదే బెయిల్స్: వివాదంలో ప్రభుత్వం!

By sahani· 26 Aug 2026· haryana
అత్యాచారం కేసు ఖైదీకి పదే పదే బెయిల్స్: వివాదంలో ప్రభుత్వం!

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష పడిన డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్‌కు హర్యానా గవర్నమెంట్ ఆగస్టు 25న 21 రోజుల ఫర్లాఫ్ మంజూరు చేసింది. 2017లో జైలుకి వెళ్లాక ఆయన బయటకు రావడం ఇది 17వ సారి. ఈ ఇయర్ లోనే జనవరి, మే తర్వాత ఇది థర్డ్ టైమ్ కావడం, ఇప్పటివరకు 435 రోజులకు పైగా బయటే గడపడం హాట్ టాపిక్‌గా మారింది. రోహ్‌తక్ సునారియా జైలు నుంచి విడుదలైన ఆయన సిర్సాలోని డేరా హెడ్ ఆఫీసులో ఉండనున్నారు. ఈ ఫ్రీక్వెంట్ రిలీజ్, VIP ట్రీట్‌మెంట్‌పై ఆపోజిషన్ లీడర్స్, యాక్టివిస్ట్స్ తీవ్రంగా విమర్శిస్తున్నారు.

More in National

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్
National· 4h ago

జంతర్ మంతర్ దాడి కేసు.. అదుపులో స్వతంత్ర భారద్వాజ్

CJP ప్రొటెస్ట్‌లో దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న యాక్టివిస్ట్ స్వతంత్ర భారద్వాజ్‌ను UPలో పోలీసులు డిటెయిన్ చేశారు. బులంద్‌షహర్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్‌లో నిషు ఆజాద్ తండ్రి సంజయ్ కుమార్‌తో గొడవ జరిగిందని, ఆయనపై దాడి చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దాడి కేసులో CJP ప్రతినిధులు <a href="https://www.theclearcutnews.com/n/WKSsto7">పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు</a> వెళ్లారు. మర్డర్ అటెంప్ట్ సెక్షన్, SC/ST యాక్ట్‌ కింద కేసు పెట్టాలని పోలీసులను కోరారు. దీంతో పోలీసులు యాక్షన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.