వికలాంగురాలిపై లైంగిక దాడి.. నిందితుడికి 10 ఏళ్ల జైలు

TG: మానసిక వికలాంగురాలిపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు శిక్ష విధించింది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలానికి చెందిన రామయ్యకు పెద్దపల్లి జిల్లా కోర్టు 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు పది వేల రూపాయల జరిమానా విధించింది. బాధితురాలికి నాలుగు లక్షల పరిహారం అందించాలని జిల్లా న్యాయ సేవా సంస్థను ఆదేశించింది. 2023లో నమోదైన ఈ కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.



