కరెంట్ షాక్‌తో యువకుడు మృతి

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలోని SFS ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో స్టీల్ రైలింగ్ పనులు చేస్తుండగా కరెంట్ లైన్ తగలడంతో రాజస్థాన్‌కు చెందిన కార్మికుడు సునీల్ బిష్ణోయ్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో అక్కడ విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
